తెనుఁగు పెద్ద బాలశిక్ష APP
శివ కిరణ్ ॥
ఎవరు అయిన ఈ mobile మొబైల్ యాప్ కి వారు అనుకునే మంచి విషయాలు పెట్టాలి అంటే ఈ ఈమెయిల్ info@sevas.org.in https://www.sevas.org.in కి పంపండి మీ పేరుతో ఆ పంపిన విషయాలు పెడతాను ॥ తెలుగు సంప్రదాయము స్వచ్ఛంగా ఇక్కడ ఉంది అని అందరూ అనుకోవాలి ॥ పంపాలి అని అనుకునేవారికి ముఖ్య గమనిక ౧౯౨౦ ముందు ఉండే విషయాలు వాటి వివరణలు మాత్రమే ఇక్కడ పెట్ట బడతాయి ॥ ఈ యాప్ బాగా పెరిగిన తరువాత భవిష్యత్తులో ఒక పుస్తకము చేస్తాను॥
ఇప్పటి కాలములో కిలో kg బదులు ఏమి వాడవచ్చు మరియు ఎలా మార్చ వచ్చు దూరము ఎలా కొలవవచ్చు కాలముని ఎలా మార్చవచ్చు రాముని కాలములో ఇప్పటి గడియారం ఉంటే అది ఎలా ఉంటుంది రాయడము చదవడము రాకుండా కొత్త భాషలు ఎలా నేర్చుకోవచ్చు ఇంగ్షీషు అలా వింటూ వింటూ ఎలా నేర్చుకోవచ్చు ఆలా చాలా విషయాలు పెట్టడము జరిగినది చైత్ర మాసము నుండి ఒక మంచి క్యాలెండరు కూడా డిజైన్ చేసాను ఇలా చాలా విషయాలు ఈ పుస్తకములో ఉన్నాయి॥
దేవుడిని ఎలా పూజించాలి సంగీతము స స స రి రి రి గ గ అంటే ఏమిటి శ్లోకాలు ఎలా రాయాలి శ్లోకము అంటే ఏమిటీ జ్యోతిష్యము అంటే ఏమిట ఆలా చాలా విషయాలు ఇక్కడ పెట్టడము జరిగినది యమ దర్శనము ఎలా చేయాలి అనేది కూడా పెట్టడము జరిగినది ॥
ఆడియో (Audio) కూడా ఉన్నాయి॥
ప్రత్యేకతలు
౧ ౨ ౩ ౪ ౫ ఈ అంకెలు ఏమిటి
-అంకెలు కూడా 1 ౧ । 2 ౨। 3 ౩। 4 ౪। 5 ౫। 6 ౬। 7 ౭। 8 ౮। 9 ౯। 0 ౦॥ ఇంగ్లీష్ వాడలేదు కొంచము గందరగోళంగా ఉన్న మన తెనుఁగు అంకెలు మనము ప్రోత్సాహము చేయాలి ॥ ఒక కాగితము మీద రాసుకుని తర్వాత నెమ్మదిగా చదవడానికి ప్రయత్నము చేయండి ॥ గణితము దగ్గర నుండి అంకెలు ఎక్కువగా ఉంటాయి ॥ మన శాస్త్రాలు అన్ని ఈ అంకెలతో రాయబడ్డాయి ॥ అన్ని భాషలు కూడా ఇటువంటి అంకెలతో పూర్వపు శాస్త్రాలు ఉన్నాయి ॥ వివిధ రకాల అంకెలు నేర్చుకుంటే మంచిది॥
౧౯౨౦ ముందు ఎందుకు
- తమిళనాడులో ఉన్న వారు సుందర తెలుగు అని అంటున్నారు దానికి కారణము సుబ్రహ్మణ్య భారతి అని ఒక మహా తమిళ కవి ॥ అతను ౧౯౨౧ లో స్వర్గస్తులు అయ్యారు ॥ అతను ఆంద్ర దేశము అంతా తిరిగినప్పుడు అతను వినిన తెనుఁగు మాత్రమే ఈ పుస్తకములో వాడబడినది ॥ ౧౯౨౦ ముందు ఏమి ఎలా ఉందో అదే ఈ పుస్తకములో పెట్టడము జరిగినది ॥
- అప్పట్లో ఎలా ఉండేది। అని కొంచము పరిశోధన చేస్తే ౧౯౦౧ లో ముద్రితము అయిన రంగస్వామి మొదలారి గారు రాసిన పెద్ద బాలశిక్ష ఒకటి దొరికినది ॥ ఆ పెద్దబాలశిక్ష నీ ప్రామాణికముగా తీసుకుని ఈ తెనుఁగుని మొత్తము ఒక దగ్గర పెట్టె ప్రయత్నము మొదలు పెట్టడము జరిగినది॥
- చుక్క . కామా , లాంటివి అన్ని ఈ పుస్తకములో వాడలేదు ౧౯౨౦ ముందు ఏమి వాడేవారు అని చుస్తే మన తెనుఁగు ఛందస్సుని వాడి చెప్పేవారు అట అంత ఎక్కువ స్థాయి అయితే చాలా కష్టము అని రామాయణములో వాడిన దండముని వాడడము జరిగినది చుక్క బదులు ॥ కామా బదులు ।
- నేను ఇంగ్లీష్ మీడియము చదువులు అవ్వడము వలన । ఈ పుస్తకములో ఎన్నో తప్పులు ఉండవచ్చు ॥ ప్రతి నెల ఈ పుస్తకములో చాలా విషయాలు చేర్చడము జరుగుతుంది ॥ యజ్ఞము పేజి చూడండి ॥ ఇది మొదటి సంస్కరణ version 1.0 మాత్రమే ॥ తప్పులు ఎవరు అయినా కనిపెట్టగలిగే ప్రతి తప్పుకు ఒక పది రూపాయలు బహుమానము ఇవ్వడము జరుగుతుంది॥
- ఒక వాట్స్ యాప్ గ్రూప్ కూడా చేయడము జరిగినది మీ పేరు చేర్చడానికి info@sevas.org.in కి మీ వివరాలు పంపగలరు లేక కామెంట్ లో పోస్ట్ చేయగలరు । సలహాలు సూచనలు ఇవ్వగలరు॥
- తెలుగు పదాలు అజంతాలు (అచ్చుతో అంతమయ్యేవి); హలలు తో అంతము కాకూడదు (సంస్కృతము, హిందీ వలె) | ఉదాహరణకు - నీకు శుభం కలుగు - ఇది తప్పు | ఇది ఒప్పు - నీకు శుభము కలుగు || పద్యరచనామృతభోదిని | పద్యగురువు కొల్లారపు ప్రకాశరావు శర్మ (USA)॥ తెలుగు సరిగ్గా రాకపోయినా నేను రాసిన వాక్యములలో ఈ సూత్రము కూడా కొంచము పాటించాను॥ ౧౯౦౧ లో రాసిన పెద్ద బాలశిక్ష పుస్తకము ఈ సూత్రము ప్రకారము ఉన్నది ॥


